అమరావతికి సహాయం నిరాకరణ సరికాదు .....

Published: Saturday June 16, 2018

రాజధాని అమరావతి నిర్మాణానికి సహాయ నిరాకరణ సరికాదని, కేంద్రం వైఖరి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీఎం చంద్రబాబు అన్నారు. 17à°¨ నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలు, విభజన చట్టం అమలు చేయకపోవడంతో ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన సచివాలయంలో అధికారులతో సన్నద్ధ సమావేశం నిర్వహించారు. ‘రాజధాని అమరావతి రూపంలో దేశం గర్వించే స్థాయిలో హరితనగరం నిర్మిస్తున్నాం. à°ˆ నగరంపై వచ్చే ఆదాయంలో అధికభాగం కేంద్రానికి వెళ్తుంది. అలాంటప్పుడు సహాయ నిరాకరణ ఎందుకో అర్థం కావడం లేదు. కేంద్రం విశ్వసనీయత కోల్పోతోంది. సహకార సమాఖ్య సూత్రాలకు దాని వైఖరి హానికరంగా మారింది’ అని దుయ్యబట్టారు. వ్యవసాయానికి కేంద్రం కేటాయింపులు సరిగా లేవని చెప్పారు. ‘జలవనరుల నిర్వహణ, వ్యవసాయ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. పాలసీ అండ్‌ గవర్నెన్స్‌ విభాగంలో గుజరాత్‌ ఆంధ్రప్రదేశ్‌ కంటే 8 పాయింట్లు ముందుండి ప్రథమ స్థానంలో నిలిచింది. కర్ణాటక మన కంటే 12 పాయింట్లు దిగువన ఉంది. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అధికారులు అధ్యయనం చేసి సిఫారసులు చేయాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో మన రాష్ట్రం ముందుంది. కోరిన ప్రతి ఇంటికీ గ్యాస్‌ ఇచ్చి దేశంలో అగ్రభాగాన ఉన్నాం. మాతా శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించాం. ఎన్ని అవరోధాలున్నా కేంద్ర సహకారం లేకున్నా à°’à°• విజన్‌తో రాష్ట్రాన్ని కష్టపడి అభివృద్ధి చేశాం. భూగర్భ జలాల్లో, వాటర్‌ మేనేజ్‌మెంట్‌లో ముందున్నామంటే అదంతా రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల కష్టం, ప్రజా సహకారం వల్లే. రాజధాని కోల్పోయి కట్టుబట్టలతో, అప్పులతో వచ్చి వృద్ధిరేటులో దేశంలో రెండంకెల వృద్ధిరేటు సాధించడం ఆషామాఫీ కాదు. నాలుగేళ్లలో ఏమీ సాధించలేదని దుష్ప్రచారం చేసే వారికి ఇవే జవాబులు’ అని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో మనమే వెనుకబడి ఉన్నామని, మన రాష్ట్రం పొరుగు రాష్ట్రాలతో సమంగా తలసరి ఆదాయం సాధించేదాకా సహకరించాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు. ప్రణాళికా విభాగం కార్యదర్శి సంజయ్‌సింగ్‌ రూపొందించిన ప్రస్తావనాంశాలకు కొన్ని చేర్పులు, మార్పులు సూచించారు. à°ˆ సమావేశంలో సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర, ముఖ్యమంత్రి కార్యదర్శులు ఏవీ రాజమౌళి, à°Žà°‚.గిరిజాశంకర్‌ పాల్గొన్నారు.