విద్యు త్‌ రంగంలో ఏపీ మెరుగైన తీరు

Published: Monday June 18, 2018
  • విద్యు త్‌ రంగంలో ఏపీ మెరుగైన తీరును ప్రదర్శిస్తోందని ప్రధాని మోదీ ప్రశంసించారు. నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో మోదీ తన ప్రసంగంలో à°ˆ అంశాన్ని ప్రస్తావించారు. ప్రత్యేకించి విశాఖపట్నంలో నూటికి నూరు శాతం ఎల్‌ఈడీ వీధి దీపాల వినియోగం గురించి ప్రస్తావించారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ అనుభవాన్ని అధ్యయనం చేసి ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. à°ˆ సమావేశం తర్వాత నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు.
 
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని హామీలన్నింటినీ నూటికినూరు శాతం అమలు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఏపీతో ఆగకుండా బిహార్‌ విభజననూ ఆయన గుర్తు చేశారు. ‘‘à°ˆ సమావేశంలో కొందరు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన హామీలను ప్రస్తావించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ విభజన సమయంలో అప్పటి చట్టాల్లో పేర్కొన్న హామీలన్నింటినీ నూటికి నూరు శాతం అమలు చేస్తామని మోదీ మాటిచ్చారు’’ అని తెలిపారు.