ప్రయాణికులను ఆకట్టుకునే దిశగా రైల్వే

Published: Tuesday June 19, 2018
దేశంలో రైలు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు భారతీయ రైల్వే శాఖ వినూత్న ఆలోచనలు చేస్తోంది. రైళ్లల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆన్‌లైన్‌ సేవలను విస్తరించడం వంటి వాటితో ఇప్పటికే ఆకట్టుకుంటున్న రైల్వే శాఖ మరో ముందడుగు వేసింది. తాజాగా రైలు బోగీలను కొత్త రంగుల్లో ముంచెత్తేందుకు నిర్ణయించింది. ఇప్పటి వరకు ముదురు ఎరుపు రంగు, ముదురు నీలం రంగులో ఉన్న బోగీలను ఇకపై లేత రంగులు సంతరించుకోనున్నాయి. దేశవ్యాప్తంగా 30 వేల రైల్వే బోగీలకు కొత్త రంగులు అద్దనుంది. అయితే అన్ని రైళ్లకు రంగులను మార్చడం లేదు. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, ఇతర ప్రత్యేక సర్వీసులకు à°ˆ కొత్త రంగుల పథకం అమలు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
 
 
చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో తయారైన మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు కోచ్‌లకు à°ˆ కొత్త రంగులు వేయనున్నారు. ‘రైల్వే కోచ్‌లకు కొత్త రూపు ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయిల్‌ అనుమతి కోసం ఎదురు చూశాం. మంత్రి అనుమతి లభించడంతో బోగీలకు à°ˆ కొత్త రంగుల పథకం అమలు చేస్తున్నాం.’ అని రైల్వే శాఖ ఉన్నతాధికారి తెలిపారు. బోగీలకు ఆకర్షణీయమైన రంగులను వేయడంతో పాటు మరోపక్క ప్రయాణికులను మరింత ఆకట్టుకునేందుకు కోచ్‌ల్లో మెరుగైన ఆధునిక సౌకర్యాలు కల్పించడంపై కూడా రైల్వే శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా బయో టాయిలెట్లు, సౌకర్యవంతమైన సీట్లు, ప్రతి బెర్త్‌కు మొబైల్‌ ఫోన్‌ ఛార్జర్లు అందించేందుకు à°† శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.