అప్పటి వరకూ ఎండలే .....

Published: Wednesday June 20, 2018


à°ˆ నెల 23 తర్వాతే వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. అప్పటి వరకూ నైరుతీ రుతుపవనాల్లో కదలిక ఉండబోదని పేర్కొన్నారు. à°ˆ లోగా ఎండలు కొనసాగుతాయని తెలిపారు. మంగళవారం గ్రీష్మతాపానికి కోస్తా ఠారెత్తిపోయింది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. మరో మూడు రోజుల వరకు కోస్తాలో ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. జూన్‌ తొలి వారంలో వర్షాలతో కొంత ఉపశమనం కలిగిందని, 13à°µ తేదీ తరువాత రుతుపవనాలు మందగించడంతో ఎండలు పెరిగాయని వాతావరణ నిపుణుడు ఆచార్య ఓఎ్‌సఆర్‌యూ భానుకుమార్‌ తెలిపారు. కాగా, à°ˆ ఏడాది ముందుగా వచ్చిన నైరుతి రుతుపవనాలు తొలిదశ విస్తరణ తర్వాత వారం రోజులు నిలిచిపోయాయి. పసిఫిక్‌ మహాసముద్రం నుంచి వచ్చే రుతుపవనాలలో à°’à°• శాఖ అరేబియా, మరో శాఖ బంగాళాఖాతం దిశగా పయనిస్తుంటా యి.
 
అయితే తొలిదశ విస్తరణ తర్వాత రుతుపవనాల కరెంట్‌ అరేబియా శాఖ దిశగా కాకుండా ఆఫ్రికా వైపుగా, బంగాళాఖాతంలో రావల్సిన కరెంట్‌ దక్షిణ చైనా సముద్రం దిశగా పయనిస్తోందని వాతావరణ నిపుణుడు ఆర్‌.మురళీకృష్ణ పేర్కొన్నారు. దీంతో వారం రోజులుగా దేశంలో రుతుపవనాల విస్తరణ నిలిచిపోయిందన్నారు. రుతుపవనాలకు కీలకమైన మేడిన్‌ జూలియన్‌ ఆస్లిలేషన్‌ ఈనెల 23 తర్వాత దేశంలోరుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉందని ఆయన వివరించారు.