సీఎం తీరు చూసి విస్తుబోయా..... జగన్‌

Published: Wednesday June 20, 2018
వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గుండాయిజాన్ని ప్రదర్శించారని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ట్విట్టర్‌లో à°ˆ అంశంపై స్పందిస్తూ.. కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన వారిపట్ల సీఎం తీరుకు విస్తుబోయానని పేర్కొన్నారు. తలనీలాలు తీసినందుకు రూ.25 చొప్పున ఇస్తానంటూ, ఏదో దేవుడిచ్చిన వరంలా చంద్రబాబు ప్రదర్శించిన హావభావాలు, ఆయనలోని అహంకార, నియంత స్వభావాలను కళ్లకు కట్టినట్లు చూపించాయని విమర్శించారు.
 
కాగా, జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో 193à°µ రోజు కొనసాగింది. పి.గన్నవరం నుంచి చాకలిపాలెం వరకు యాత్ర సాగింది. లంకల గన్నవరంలో ఇసుక తవ్వకాలపై సీబీఐ విచారణ జరిపించాలని, జొన్నల్లంకలో మత్స్యకారులు సమస్యలు తీర్చాలని, కందాలపాలెంలో రెడ్డి సామాజికవర్గం సమస్యలపైన, ఉద్యోగాల క్రమబద్ధీకరించాలని కాంట్రాక్టు విద్యుత్‌ ఉద్యోగులు, సమస్యలు తీర్చాలని నాయీ బ్రాహ్మణులు జగన్‌కు వినతిపత్రాలు అందజేశారు. జొన్నల్లంకలో పలువురు వైసీపీలో చేరారు. సుమారు పది కిలో మీటర్లు యాత్ర సాగింది. నాగుల్లంక శివారు చాకలిపాలెంలో జగన్‌ బస చేశారు.