ఈ రోజు యోగా చేస్తే గిన్నీస్‌బుక్ సర్టిఫికెట్

Published: Thursday June 21, 2018

à°ˆ రోజు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం. à°ˆ సందర్భంగా రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే, యోగా గురువు రామ్‌దేవ్‌à°² సమక్షంలో యోగాలో వరల్డ్ రికార్డ్ సాధించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం కోటాలోని ఆర్‌ఏ‌సీ మైదానంలో హైటెక్ హంగులు సమకూర్చారు. ఇక్కడ నేడు జరిగే యోగా కార్యక్రమం కొత్త రికార్డు సృష్టించనుంది. ఒకే చోట అత్యధికులు యోగా నేర్చుకుంటూ రికార్డు నెలకొల్పనున్నారు. à°—à°¤ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మైసూర్‌లో ఒకేసారి ఏకంగా 55,506 మంది యోగాసనాలు వేశారు. à°ˆ రికార్డును బద్దలుకొట్టే విధంగా కోటాలో à°ˆ రోజు కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక సర్టిఫికెట్ అందజేయనున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు దేశంలోని ఐదు ప్రాంతాల్లో నేడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిని పరిశీలించేందుకు గిన్నీ స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు‌కు చెందిన ప్రతినిధులు భారత్ వచ్చారు. వీరు గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకునే యోగా కార్యక్రమాన్ని గుర్తించనున్నారు.