కడప ఉక్కు ఖాయం

Published: Wednesday June 27, 2018
à°•à°¡à°ª ఉక్కు : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని, దీన్ని రాజకీయం చేయొద్దని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ సూచించారు. ఏపీ, తెలంగాణల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. à°ˆ విషయంలో ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలన్నారు. ఉక్కు పరిశ్రమల ఏర్పాటుపై మంగళవారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి సమక్షంలో బీరేంద్ర సింగ్‌, ఏపీ బీజేపీ నేతలు కందుల రాజమోహన్‌రెడ్డి, వై రఘునాథబాబు సమావేశమయ్యారు. à°ˆ సందర్భంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పురోగతిపై వెంకయ్య కేంద్రమంత్రిని à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు.
 
ప్రస్తుతం మెకాన్‌ నివేదికల మేరకు కేంద్రం తుది ప్రాజెక్టు నివేదికను తయారుచేస్తోందని, పూర్తిస్థాయిలో చర్చించి.. తుది నిర్ణయం ప్రకటిస్తామని బీరేంద్రసింగ్‌ చెప్పినట్లు సమాచారం. కడపలో ఉక్కు పరిశ్రమకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని కందుల రాజమోహన్‌రెడ్డి విలేకరులకు చెప్పారు. టీడీపీ నేతల దీక్షలో నిజాయితీ లేదన్నారు. ప్రధాని కడపకు వచ్చి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారని వారికి తెలుసని, కేవలం రాజకీయ లబ్ధి పొందేందుకే దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో ఆరు à°—à°‚à°Ÿà°² పాటు దీక్ష చేయలేని నేతలు ఆరు రోజులుగా ఎలా దీక్ష చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.