పల్లెలోనే బాలయ్య ఎక్సర్‌సైజ్ ....

Published: Thursday June 28, 2018
మూడు రోజుల పర్యటనలో భాగంగా హిందూపురంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గంలో పల్లెనిద్ర చేశారు. à°—à°¤ రాత్రి చిలమత్తూరు మండలం దిగువపల్లి తాండాలో చంద్రనాయక్ ఇంట్లో బాలయ్య బస చేశారు. గురువారం తెల్లవారుజామునే నిద్రలేచిన బాలయ్య ఎక్సర్‌సైజ్ చేస్తూ కనిపించారు. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆపై తండాలోని ప్రజలు ఆయనను కలుసుకునేందుకు తరలివచ్చారు. à°ˆ సందర్భంగా మాట్లాడిన బాలయ్య తన నియోజకవర్గంలో ప్రతీ గ్రామ సమస్యను పరిష్కరిస్తున్నామని అన్నారు. ఏపీ అభివృద్ధి సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్న బాలకృష్ణ త్వరలోనే మండలంలోని అన్ని చెరువులు హంద్రీనివా జలాలతో నింపుతామని హామీ ఇచ్చారు.
 
తొలిరోజు హిందూపురంలో పర్యటించిన బాలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. చాగలేరు ఎస్సీ కాలనీలో సహపంక్తి భోజనం చేశారు. చిలమత్తూరు మండలంలోని సోమఘట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చంద్రబాబు పేరుమీద అర్చనలు చేయించారు.