ఇరుకు గదుల్లో నెట్టుకొస్తున్న పాఠశాలలు

Published: Friday June 29, 2018
ఒకప్పుడు విద్య అంటే సామాజిక బాధ్యత. కానీ.. నేడు అది వ్యాపారమైపోయింది. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. à°ˆ స్కూళ్లన్నింటికీ అనుమతులు ఉన్నాయా.. నిబంధనలు పాటిస్తున్నాయా అంటే చెప్పలేం. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 15వేల వరకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు ఉండగా... మరో 5వేలకు పైగా స్కూళ్లు గుర్తింపు, అనుమతులు లేకుండానే నడుస్తున్నట్లు సమాచారం. కొన్ని జిల్లాల్లో బెల్టు షాపుల మాదిరిగా ప్రైవేట్‌ పాఠశాలలు నడుస్తున్నాయి. à°’à°• గుర్తింపు నంబర్‌ తీసుకుని.. అదే నంబరుతో నాలుగైదు బ్రాంచ్‌లనూ నిర్వహించే బాగోతం యథేచ్ఛగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రైవేట్‌ స్కూళ్లు అధికంగా ఉన్న పశ్చిమగోదావరి, కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో à°ˆ తంతు విస్తృతంగా నడుస్తోంది. విద్యాశాఖ అధికారులు ఉత్తుత్తి తనిఖీలకే పరిమితం కావడంతో ఆయా యాజమాన్యాలు మరింత బరి తెగిస్తున్నాయి. అర్హతలేని ఉపాధ్యాయులతో క్లాసులు నిర్వహిస్తూ భావిభారత పౌరుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో కొత్తగా వెలిసిన స్కూళ్లను పరిశీలించి, తగిన చర్యలు తీసుకునే తీరిక ఎంఈఓ, డీవైఈవోలకు లేకుండా పోయింది.