కేంద్రానిదీ అదే ఆలోచన...అరుణా శర్మ

Published: Saturday June 30, 2018

à°•à°¡à°ª ఉక్కుపై కేంద్రం కూడా ‘ప్రైవేటు’ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో గురువారం ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌తో టీడీపీ ఎంపీలు భేటీ అయిన సమయంలో... అక్కడే ఉన్న కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరుణా శర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సెయిల్‌ తన ప్లాంటును ఏర్పాటు చేయలేకపోతే... ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసేందుకు వీలుగా గనుల కేటాయింపుల విధానంలో మార్పులూ చేర్పులూ చేస్తామని టీడీపీ ఎంపీలకు వివరించారు. à°•à°¡à°ª స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే సంస్థకు ‘సొంత అవసరాలకు’ (క్యాప్టివ్‌ మైనింగ్‌) మాత్రమే గనులు కేటాయించవచ్చునని అరుణాశర్మ చెప్పారు. దీన్ని బట్టి ప్రైవేటుకైనా ఓకేనని కేంద్ర సంకేతాలిచ్చినట్టయింది.