దేవదాయ శాఖలో లైంగిక వేధింపులు

Published: Monday July 09, 2018
‘‘చీరలో బాగున్నావు. నైటీలో ఇంకా బాగుంటావు’’ సహోద్యోగి వ్యాఖ్య. ‘‘ఇదిగో నీ కోసమే à°ˆ గిఫ్ట్‌ కొన్నాను. ఎవ్వరికీ చూపించకు. ఇంటికి వెళ్లిన తరువాతే చూడాలి’’ ఉద్యోగినికి à°“ పై అధికారి బెదిరింపుతో కూడిన బలవంతపు బహుమతి. మరొకడు చేయిపట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు... కళ్లెర్ర జేశామా, ‘అబ్బే నీ తండ్రిలాంటి వాడిని’ అంటూ తప్పించుకో జూస్తాడు. ఇంకొకడు బరితెగించి ఏకంగా ‘నా గదికి వస్తావా? లేక నన్నే నీ గదికి రమ్మంటావా?’ అంటూ రాత్రి పొద్దుపోయిన తరువాత ఫోన్‌ చేస్తాడు. ఇలాంటి లైంగిక దాడులు నిత్యం à°† ఉద్యోగినులను క్షోభకు గురిచేస్తున్నాయి.
 
కక్కలేక, మింగలేక నిత్యం వారు నరకం అనుభవిస్తున్నారు. ఫిర్యాదు చేద్దామంటే అందరూ తమకన్నా పై ఉద్యోగులు. ధైర్యం చేసి చెప్పుకొంటే భవిష్యత్తులో ఉద్యోగం చేసుకోలేమన్న భయం. ఇదంతా à°“ మహిళ ఉన్నతాధికారిగా ఉన్న దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలోనే సాగుతోంది. నిత్యం దైవకార్యాలకు చెందిన పనులను చేయాల్సిన ఉద్యోగులు వ్యక్తిగతంగా వెకిలిచేష్టలకు పాల్పడుతూ, à°† కార్యాలయాన్నే అపవిత్రం చేస్తున్నారు. ద్వందార్థాలు, బూతు అన్వయింపులతో కూడిన మాటలు తప్ప మరేమీ మాట్లాడటం రాని ‘ముదుర్లు’ ఇప్పుడు à°† కార్యాలయంలో చీడపురుగుల్లా తయారయ్యారు. కార్యాలయంలోని మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కార కమిటీ ఉండీ లేనట్లుగా వ్యవహరిస్తూండటంతో వేధింపుల రాయుళ్లు మరీ చెలరేగిపోతున్నారు.
కమిషనర్‌ కార్యాలయంలోని à°“ ఉద్యోగినికి కొద్ది రోజుల క్రితం à°“ అధికారి రాత్రి 9à°—à°‚à°Ÿà°² తరువాత ఫోన్‌ చేశారు. ‘నీ రూంకి వస్తా. లేదంటే నీవే నా రూంకి వచ్చేయ్‌. ఏదో à°’à°•à°Ÿà°¿ చెప్పు’ అంటూ గారాలు పోయాడు. షాక్‌కు గురైన ఆమె ఫోన్‌ కట్‌ చేశారు. పదేపదే వస్తున్న ఫోన్‌లను తీయకుండా ఆమె మౌనంగా ఉండిపోయారు. దీనితో విసుగెత్తిపోయిన సదరు రసికోద్యోగి సందేశాలను పంపించాడు. ‘రూంకు రాకపోతే వృత్తిపరంగా సహకరించటం లేదని నీ భర్తకు చెపుతా’ అంటూ సందేశం పంపించాడు. బెదిరింపుతో ఆగకుండా అన్నంతపనీ చేశాడు. 10à°—à°‚à°Ÿà°² తరువాత ఆమె భర్తకు ఫోన్‌ చేశాడు. దీనితో భర్త ఆమెకు ఫోన్‌ చేసి ‘ఏం జరుగుతోంది. à°ˆ వేళప్పుడు à°ˆ ఫిర్యాదులేంటి’ అంటూ విచారించాడు. దీనితో ఆమె పూర్తిగా బెంబేలెత్తిపోయారు. సహచర ఉద్యోగినికి చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు.