ప్రయివేటు ఆస్పత్రులపై సుప్రీం సంచలన తీర్పు

Published: Monday July 09, 2018

ప్రభుత్వం నుంచి సబ్సిడీ కింద భూములు తీసుకుని నిర్వహిస్తున్న ప్రయివేటు ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం... బలహీన వర్గాలకు చెందిన రోగులకు ఉచిత వైద్యం చేయాలని ఆదేశించింది. పేద రోగులకు ఎన్ని బెడ్స్ కేటాయించాలన్న దానిపై ప్రభుత్వానికి, ప్రయివేటు ఆస్పత్రులకు మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సుప్రీం హెచ్చరించింది. కోర్టు ధిక్కరణ కింద ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పేద రోగులకు ప్రయివేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తున్నారా లేదా అన్న దానిపై స్వయంగా పర్యవేక్షించనున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. ఈ వ్యవహానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని ఆదేశించింది.