అన్నను అంటే కొట్టేంత కోపమొస్తుంది

Published: Tuesday July 10, 2018
‘జనసేన పార్టీ చిరంజీవి అభిమానులది. నా ఒక్కడిది కాదు. ఆయన అభిమానుల్లో నేనూ ఒకడిని. నాకు ఒక్కరే హీరో. ఆయనే చిరంజీవి’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తనకు తాను ఎప్పుడూ హీరోగా భావించుకోలేదని, తన అన్నయ్యకు ఎప్పటికీ అభిమానిగానే ఉండిపోతానని చెప్పారు. తనను ఎవరు ఎన్ని మాటలన్నా కోపం రాదని, చిరంజీవి గురించి మాట్లాడితే వెళ్లి కొట్టేంత కోపం వస్తుందన్నారు. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వెళ్లారని తెలిపారు. à°…à°–à°¿à°² భారత చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు స్వామినాయుడితో పాటు పలువురు ముఖ్యనేతలు సోమవారమిక్కడ గచ్చిబౌలిలో జనసేనలో చేరారు. à°ˆ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తన అన్న గొప్ప స్థాయికి ఎదిగారని.. ఎన్‌సీసీలో కాలేజీ కెప్టెన్‌ హోదాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సెల్యూట్‌ చేస్తూ రిపబ్లిక్‌డే పరేడ్‌లో పాల్గొన్నారని తెలిపారు. ‘సామాజిక, రాజకీయ మార్పు కోసం పుట్టిందే జనసేన. ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ల మధ్య భిన్నమైన భావనలు, వ్యక్తిత్వాలు, ఆలోనలు ఉండడంలో తప్పు లేదు. కొందరు వాటిని అర్థం చేసుకోకుండా స్పర్థలని ప్రచారం చేస్తున్నారు.
 
ప్రజల పక్షాన నిలబడితే వాళ్లే అధికారాన్ని ఇస్తారు’ అని చెప్పారు. పనిచేసేందుకు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించాలని తాను భావిస్తానని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడపాల్సిందిగా తనను కొందరు కోరారని చెప్పారు. తెలంగాణలో కూడా తనను గుండెల్లో పెట్టుకుని చూసుకునే అభిమానులున్నారని, కలపడం తప్ప విడదీయడం తన అభిమతం కాదని అందుకు నిరాకరించానని చెప్పారు. కామన్‌ మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను తాను 2007లో ఏర్పాటు చేశానన్నారు. తన మాట విని 2014లో ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్‌రావును ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు.