జమిలిపై టీడీపీ, వైసీపీ చెరోదారి

Published: Wednesday July 11, 2018
 à°œà°®à°¿à°²à°¿ ఎన్నికలపై రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం వెనుక ఎన్నికలపై వాటి అంచనాల్లో నెలకొన్న వైరుధ్యం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జాతీయ న్యాయ కమిషన్‌ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో జమిలి ఎన్నికల ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. కావాలంటే లోక్‌సభ ఎన్నికలు ముందుగా పెట్టుకోవాలని.. తమకేమీ అభ్యంతరం లేదని.. అసెంబ్లీ ఎన్నికలను ముందుకు తెస్తామంటే అంగీకరించేది లేదని తెగేసిచెప్పింది. జమిలి ఎన్నికల ప్రతిపాదన ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలకు వ్యతిరేకమని, అది జాతీయ పార్టీలకే ఉపకరించే ప్రక్రియగా పేర్కొంది. వైసీపీ మాత్రం జమిలి ఎన్నికలను సమర్థించింది. రాబోయే ఎన్నికలపై నెలకొన్న అంచనాలే à°ˆ పార్టీలు భిన్న వైఖరులకు కారణమంటున్నారు.
 
‘మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల ఎన్నికలు ముందు జరిగి వాటిలో ఓటమి ఎదురైతే అదే ప్రభావం లోక్‌సభ ఎన్నికలపైనా పడుతుందని.. అదే à°ˆ అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి జరిగితే నష్టం ఉండదని బీజేపీ అంచనా వేస్తోంది. దగ్గరలో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, ఒడిసా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా జత కలిపి నిర్వహిస్తే తనకు కొంత ప్రయోజనం ఉంటుందని, కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఇవ్వగలిగిన పార్టీగా ప్రజల ముందుకు వెళ్తే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సానుకూల ఫలితాలు వస్తాయని à°† పార్టీ భావిస్తోంది’ అని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి 2019 మే నెలలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. లోక్‌సభ ఎన్నికలు కూడా అప్పుడే రావాలి. ఏ కారణం వల్లనైనా లోక్‌సభ ఎన్నికలు ముందుగానే వస్తే అది తనకే మంచిదని టీడీపీ భావిస్తోంది.