ఈ ఘనత నా ఒక్కడిది కాదు

Published: Thursday July 12, 2018
‘సింగపూర్‌ పర్యటన ముగించుకుని అక్కడి విమానాశ్రయంలో విమానం ఎక్కబోతుండగా సులభతర వ్యాపారం.. (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌.. ఈవోడీబీ)లో రాష్ట్రం నంబర్‌వన్‌à°—à°¾ నిలిచిందనే విషయం చెప్పారు. చాలా సంతోషమేసింది. విజయం కోసం కష్టపడేవారికి.. విజయం సాధించాక వచ్చే కిక్‌ అది. ఇది సక్సెస్‌ కిక్‌’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చేసి చూపించామన్నారు. ఆయన బుధవారమిక్కడ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లలోనే సులభతర వ్యాపారంలో దేశంలో ఉన్నత స్థానానికి చేరామని చెప్పారు. ‘మన గురించి మనం చెప్పుకోవడం కంటే బయటివాళ్లు చెప్పింది ప్రామాణికం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ సర్వేను కేంద్ర ప్రభుత్వంలోని డీఐపీపీ.. ప్రపంచబ్యాంకు కలిసి చేశాయి. అందులో మనం నంబర్‌వన్‌à°—à°¾ వచ్చాం’ అని హర్షం వ్యక్తం చేశారు. à°ˆ ర్యాంకు ఇచ్చేందుకు రెండంశాలు ఆధారంగా తీసుకున్నారని తెలిపారు.
 
‘à°’à°•à°Ÿà°¿.. పారిశ్రామికవేత్తలకు త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు చేపట్టిన సంస్కరణలు.. రెండోది పరిశ్రమలు పెట్టినవారిని అనుమతుల కోసం ఏమైనా లంచాలు అడిగారా అన్నది.. à°ˆ రెండింటిలోను కలిపి ఆంధ్ర 98.42 శాతం స్కోరు సాధించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో దేశంలోనే పెద్దది à°•à°¿à°¯ మోటార్స్‌. 2 లక్షల బిలియన్‌ డాలర్ల పెట్టుబడి అది. గతంలో వోక్స్‌వ్యాగన్‌ వస్తే ఇప్పుడు వైసీపీలో ఉన్న నేతలు దాన్ని బలిపశువును చేశారు. అది పుణే వెళ్లిపోయింది. అప్పుడే కనుక అరడజను కంపెనీల్ని తీసుకొని వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. మేం à°ˆ నాలుగేళ్లలో కియా, హీరో, ఇసుజు, అపోలో టైర్స్‌, అశోక్‌ లేలాండ్‌ తదితర సంస్థలను తెచ్చాం. ఇన్ని జరుగుతుంటే కొందరు అవినీతిపై మాట్లాడుతున్నారు. ఒక్కటే చెబుతున్నాను.. à°ˆ ప్రభుత్వంలో నీతివంతమైన పాలన ఉండబట్టే కంపెనీలు వస్తున్నాయి. మేమెవరికీ డబ్బులివ్వం.. అవినీతి లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదని à°•à°¿à°¯-ప్రభుత్వానికి జరిగిన ఒప్పందంలో పెట్టాం. రోడ్లపై మాట్లాడేవాళ్లు.. నాలుగేళ్ల ముందు రాష్ట్రానికి ఏం పరిశ్రమలు వచ్చాయో చెప్పాలి. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, తప్పుడు విధానాలు, అవినీతితో బ్రాండ్‌ ఏపీని దెబ్బతీశారు. వీరి అవినీతి వల్ల అధికారులు జైలుకెళ్లారు’ అని దుయ్యబట్టారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ప్రథమ స్థానం రావడం అన్నది తన ఒక్కడి వల్ల కాలేదని, మొత్తం జట్టు కారణమని సీఎం తెలిపారు. ‘నేను మార్గదర్శనం చేసి, సమన్వయం చేసేవాడినే. à°ˆ ఘనత మంత్రులు, కార్యదర్శులు, కింది స్థాయి ఉద్యోగి వరకు అందరిదీ. దేశంలోనే అత్యంత సమర్థమైన జట్టును రాష్ట్రంలో తయారుచేశాం’ అని చెప్పారు.