పోలవరం ప్రాజెక్టు మీదీ... మాదీ!

Published: Thursday July 12, 2018
 ‘‘పోలవరం ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది కాదు! ఇది మొత్తం భారతదేశానిది. ప్రధాని మోదీ సారథ్యంలో దీనిని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. నిధులకు సమస్యే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం à°Žà°‚à°¤ పట్టుదలతో ఉన్నారో... కేంద్రం కూడా అంతే చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.
 
బుధవారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడే గడ్కరీ, చంద్రబాబు కలిసి మీడియాతో మాట్లాడారు. పోలవరం పూర్తికి సహకరిస్తామంటూనే... పెరిగిన అంచనాలపై సహేతుక కారణాలను వివరించి, ఆర్థిక శాఖను ఒప్పించాల్సి ఉందని అన్నారు. ‘‘à°’à°• రైతుగా నీరు à°Žà°‚à°¤ ముఖ్యమో నాకు తెలుసు. గ్రామీణ, వ్యవసాయాభివృద్ధికి నీరే కీలకం. నీటి కొరతతో మా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలవరం చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌ది కాదు... మొత్తం దేశానికి చెందినది. ప్రతి ఏటా 3వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి.
 
à°ˆ ప్రాజెక్టు ద్వారా ఏపీ రైతులకు కొత్త జీవితం అందించవచ్చు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం పూర్తికి కట్టుబడి ఉంది. కొన్ని సమస్యలున్నాయి. వాటి పరిష్కారంపైనా నిర్ణయాలు తీసుకున్నాం’’ అని తెలిపారు. తొమ్మిది నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పు చోటు చేసుకుందన్నారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని గడ్కరీ పేర్కొన్నారు. సివిల్‌ పనులను ఫిబ్రవరి ఆఖరుకల్లా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు గడువు విధించారు. ‘‘ఏప్రిల్‌ ఆఖరుకు పూర్తి చేస్తామని వారంటున్నారు. అయితే... మార్చి మొదటివారంలో మళ్లీ నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను. అప్పటికి ప్రాజెక్టు పూర్తయితే చూడాలని భావిస్తున్నాను. ఎందుకంటే... మేలో ఎన్నికలొస్తాయి. అంతకంటే ముందే ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. అందుకే, ఫిబ్రవరి ఆఖరుకల్లా సివిల్‌ పనులు పూర్తి చేయాలి! ఎన్నికల తర్వాత ఏమిటన్నది ప్రజలు నిర్ణయిస్తారు’’ అని వ్యాఖ్యానించారు.