చంద్రబాబుపై కృష్ణంరాజు ప్రశంసలు

Published: Friday July 13, 2018

విశాఖపట్నం: à°à°ªà±€ సీఎం చంద్రబాబుపై కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజు ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పవన్, జగన్‌లకు బీజేపీ స్క్రిప్ట్‌ ఇస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. పాటలు, స్కిట్స్ ద్వారా ప్రజలకు నిజాలు తెలియజేయనున్నట్లు ఆయన చెప్పారు. ఉత్తరాంధ్రలో ఎక్కడా బీజేపీపై నెగిటివ్ అభిప్రాయం లేదని కృష్ణంరాజు అన్నారు.