అధికారంలోకి రాగానే ఎపికి ప్రత్యేక హోదా

Published: Monday July 23, 2018

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోనికి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో తీర్మానించారు. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు, మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించిన అనంతరం ఆంధ్ర ప్రదేశ్‌పై ప్రత్యేకప్రస్తావన తెచ్చారు. సమావేశంలో రాహుల్‌గాంధీ, యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. à°¤à°® ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ పార్టీ నెరవేరుస్తుందని వారు ప్రకటించారు. ఇప్పటికే పలు పర్యాయాలు రాహుల్‌ అనేక సందర్భాల్లో కాంగ్రెస్‌ పార్టీపరంగా ఎపికి అన్యాయం జరిగిందని చెపుతూ వచ్చారు. ప్రత్యేక హోదా ఇతర రాష్ట్రాలకు ఇందుకు పొంతనలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత స్థితిగతులు వేరని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన అన్నారు. తమప్రభుత్వం ఇచ్చిన హామీని అధికారంలోనికి వచ్చినవెంటనే నెరవేరుస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెల్లడిం చారు.