శివలింగం చుట్టూ అంగుళం మేర కరిగిన మందం

Published: Thursday July 26, 2018
 à°¦à±‡à°µà°²à±‹à°• అధిపతి దేవేంద్రుడుచే ప్రతిష్ఠించబడిన అమరేశ్వరస్వామి పాల రాతి లింగం కొన్ని శతాబ్దాలుగా భక్తులచే పూజలు అందుకుంటూ నిత్యం పవిత్రజల, పంచామృతాలతో అభిషేకం చేయించుకుంటూ వారి కోరికలను తీర్చే à°ˆ మహాలింగానికి ముప్పువాటిల్లే పరిస్థితి ఏర్పడింది. అతిసున్నితమైన పాల రాతితో ఉన్న 32 అడుగుల శివలింగం పానుపట్టంపై భాగంలో 9 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనం ఇస్తూ పూజలు అందుకోవడం జరుగుతుంది. శివలింగం ఎత్తు పెరుగుతుందని శివలింగంపై మేకు కొట్టారని అప్పటి నుంచి పెరగడం ఆగిపోయిందని స్థల పురాణంగా చెప్పుకుంటారు. సుమారు మూడు అడుగుల కైవారంతో ఉన్న శివలింగం చుట్టూ అంగుళం మందం ప్రస్తుతం కరిగిపోయింది. శివలింగంపై అభిషేక జలం పైనుంచి కిందకు జారడంతో గుంతలు ఏర్పడ్డాయి. వీటిని గతంలో పురావస్థుశాఖ, దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. అయితే ఇంతవరకు అవి ఆచరణలోకి రాలేదు. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ‘మూలవిరాట్‌కు ముప్పు’ కథనంపై స్పందించిన ఈవో శ్రీనివాసరెడ్డి బుధవారం దేవదాయశాఖ ఉన్నతాధికారులకు వివరించేందుకు సంబంధిత కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం.
 
స్వామివారికి నిత్యాభిషేకాలు
ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారికి పది సార్లు అభిషేకాలు జరుగుతాయి. ఈ అభిషేకంలో జలంతో పాటు కొబ్బరినీళ్లు, పంచామృతాలైన తేనే, పండ్లు, పాలు, పెరుగు, పంచదారతో అభిషేకం జరుగుతుంది. విభూది, గంధంతో కూడా స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ అభిషే కాలకు వినియేగించే వస్తువులు ఎక్కువ శాతం కల్తీవి. రసాయానాలతో ఉన్న ఆయా వస్తువుల కారణంగా పాలరాతి లింగానికి నష్టం వాటిల్లుతుంది. గతానికి ఇప్పటికి శివలింగంలో జరుగు తున్న మార్పులు ఇలానే కొనసాగితే భావితరాలకు అమరలింగేశ్వర స్వామి లింగం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
 
ఇలాగైతే ప్రమాదమే
పాలరాతితో ఉన్న అమరేశ్వరస్వామి లింగాకారం కాలానుగుణంగా తరుగుతూ వస్తుంది. స్వామి వారికి ఉపయోగించే అభిషేకాల వల్లే పాలరాయిపై గుంతలు పడి సన్నబడుతుంది. ఇదేవిధంగా కొనసాగితే కొన్నేళ్లలోనే విరిగి పడిపోయే ప్రమాదం ఉంది. అధికారులు మహాలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేసి లింగానికి పక్కనే మరో చిన్న లింగాన్ని ఏర్పాటు చేసి దానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. అలా చేస్తే కొంతవరకైనా పాలరాతి లింగాన్ని రక్షించుకున్న వారమవుతాము.