శివస్వామి మద్దతుదారుల అరెస్టు

Published: Monday July 30, 2018

విజయవాడ,: à°¹à°¿à°‚దూ ధర్మ పరిరక్షణ కోసం శివస్వామి చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ సత్యనారాయణపురంలోని విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయం వద్ద శివస్వామి మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంద్రకీలాద్రి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తానని కొద్దిరోజుల క్రితం శివస్వామి ప్రకటించారు. విజయవాడలో సెక్షన్‌ 144, 30 అమల్లో ఉన్నందున పోలీసులు యాత్రకు అనుమతి నిరాకరించారు. అయినా యాత్ర నిర్వహించడానికి శివస్వామి, ఆయన అనుచరులు శ్రీసత్యకామేశ్వరనంద ఆశ్రమం మునిపల్లికి చెందిన ఆనంద సరస్వతీస్వామి, యోగిశ్రీనివాసప్రభుస్వామి(గుంటూరు), త్యాగనందమయి మాతాజీ, మత్సకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబాబు, వీహెచ్‌పీ నగర కార్యదర్శి రాఘవరాజుతో పలువురు వీహెచ్‌పీ కార్యకర్తలు పాదయాత్రకు సిద్ధమవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు కార్యాలయం వద్దనే వారిని అడ్డుకున్నారు. అరెస్టులపై స్వామీజీలు మండిపడ్డారు. హిందూ ధర్మంపై పథకం ప్రకారం దాడి జరుగుతోందన్నారు. ‘హిందూ ధర్మపరిరక్షణ కోసమే తాము పాదయాత్ర చేస్తున్నాం. దీనికి అనుమతి తీసుకొవాల్సిన అవసరం ఏముంది? మేము ఏమైనా నేరస్తులమా? రామనామ జపం చేసుకుంటూ వీధుల వెంట వెళ్లే స్వామీజీలను అరెస్టు చేయడం దారుణం’ అని మండిపడ్డారు.