గేలి చేసినా గెలిచి చూపించి... చరిత్ర సృష్టించారు!

Published: Tuesday July 31, 2018
పెందుర్తి/విశాఖపట్నం: à°•à±Šà°¤à±à°¤ ముఖాలు వీరేం గెలుస్తారు.. నియోజవర్గ మూలాలు కూడా తెలియవు.. రాజకీయ అనుభవం అసలే లేదు. ఉద్దండులతో పోటీ కష్టమే... పెందుర్తి నుంచి పోటీకి దిగిన ఇద్దరు అభ్యర్థులకు ఎదురైన చేదు అనుభవాలివి.. ఎన్నికలకు దాదాపు మూడు నాలుగు నెలల ముందే కసరత్తు ప్రారంభించి ప్రచారంలో ప్రతి ఊరూ.. ప్రతి గడపా రెండేసి సార్లు చుట్టి వస్తేనే విజయావకాశాలపై తేల్చిచెప్పలేని స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అవిగో ఎన్నికలనగా కేవలం 15 నుంచి 20 రోజుల వ్యవధిలో టిక్కెట్‌ దక్కించుకుని పోటీకి దిగిన పంచకర్ల రమేశ్‌బాబు, మానం ఆంజనేయులకు ఎక్కడికి వెళ్లినా ఇలాంటి మాటలే ఎదురయ్యాయి. ఉద్దండులతో పోరులో వీరి స్థానమేంటో అని గేలిచేసిన వారే తలదించుకునేలా వీరిద్దరు మహామహులను మట్టి కరిపించి శాసనసభకు ఎన్నికయ్యా రు. పెందుర్తి నియోజకవర్గంలో ఇదో రికార్డుగా నిలిచిపోయింది. 1994, 2009 శాసనసభ ఎన్ని కల్లో నాలుగు దశాబ్దాలుగా టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్న విధానాన్ని బ్రేక్‌ చేస్తూ ఇతర పార్టీల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1994లో సీపీఐ నుంచి మానం ఆంజనేయులు, 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పంచకర్ల రమేశ్‌బాబు పెందుర్తి ఎమ్మెల్యేలుగా ఎన్నియకయ్యారు.
 
 
16 రోజుల్లో ఎమ్మెల్యేగా పంచకర్ల
నియోజవర్గ పునర్విభజన తరువాత 2009 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీచేసిన పంచకర్ల రమేశ్‌బాబు అనూహ్య విజయం సాధించారు. పెందుర్తి, పరవాడ, à°¸ బ్బవరం నుంచి ఆశావాహులు ప్రజారాజ్యం పార్టీ టికెట్టు ఆశించారు. ఉత్కంఠకు తెరిదించు తూ ఆఖరి నిమిషంలో విశాఖకు చెందిన పం చకర్ల రమేశ్‌బాబుకు పెందుర్తి నుంచి పోటీచేసేందుకు పీఆర్పీ టికెట్టు ఇచ్చింది.
 
ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు సిద్ధపడిన పంచకర్లకు పెందుర్తి నుంచి పోటీచేయాల్సిరావడం,నామినేషన్‌ గడువు ముగియడానికి ముందు రోజు పార్టీ టికెట్టు ప్రకటించడంతో హడావుడిగా ఆఖరురోజున పార్టీ బీఫాంతో చివరి క్షణంతో నామినేషన్‌ వేశారు. అప్పటికే కాం గ్రెస్‌ నుంచి à°—à°‚à°¡à°¿ బాబ్జీ, టీడీపీ నుంచి బండారు సత్యనారాయణమూర్తి వంటి ఉద్దండ రాజకీయ నేతలు పెందుర్తి బరిలో ఉన్నారు. పీఆర్పీ కొత్త పార్టీ. à°ˆ ప్రాంతానికి కనీస పరిచయంలేని కొత్త ముఖం పంచకర్లది. దీంతో ఆయనకు à°ˆ ఎన్నిక విషమ పరీక్షగా నిలిచింది.
 
 
అంతేకాదు à°† పార్టీ నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడిన ఆశావాహుల ఇబ్బందులు. తొలి ప్రయత్నంలోనే రాజకీయంగా పెను సవాళ్లు ఎదు ర్కొన్న పంచకర్ల వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఆశావాహులను బుజ్జగించి మీలో ఒకడిననే నమ్మకం కలిగించారు. తన సామాజి à°• వర్గం ఓటర్లను విశేషంగా ఆకర్షించారు. ఎన్ని à°•à°² ప్రచారంలో ఆర్థిక వనరులు పూర్తిగా వినియోగించారు. కొద్ది సమయమే ఉన్నప్పటికీ ని యోజకవర్గమంతా సుడిగాలిలా పర్యటించారు. అప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బండారు, ఒకసారి à°Ž మ్మెల్యేగా ఎన్నికైన బాబ్జీకి పంచకర్ల గట్టిపోటీనిచ్చారు. à°ˆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన à°—à°‚à°¡à°¿ బాబ్జీపై పంచకర్ల రమేశ్‌బాబు 3వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో పంచకర్ల 16 రోజుల్లో పెందుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.