కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చర్యలు

Published: Friday August 03, 2018
రాష్ట్ర విభజన హామీలలో భాగమైన à°•à°¡à°ª ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని à°•à°¡à°ª, తెలంగాణలోని బయ్యారం ఉక్కు పరిశ్రమల స్థాపన సాధ్యాసాధ్యాలపై కేంద్రం నియమించిన టాస్క్‌ఫోర్సు బృందానికి అవసరమైన సాంకేతిక సమాచారం, ఇతర వివరాలను ఇప్పటివరకూ రాష్ట్ర ఖనిజశాఖ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థల అధికారులు అందిస్తూ వస్తున్నారు. కానీ, ప్రత్యేకంగా అధికారుల బృందమేదీ కేంద్రం వద్దకు వెళ్లడం లేదు. à°ˆ నేపథ్యంలో ఇకపై à°•à°¡à°ª జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రంపై ఒత్తిడిని పెంచేలా రాష్ట్ర స్థాయిలో టాస్క్‌ఫోర్సును నియమించింది. à°•à°¡à°ª జిల్లాలో ఉక్కు పరిశ్రమను స్థాపించాలని డిమాండ్‌ చేస్తూ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఇటీవల ఆమరణ దీక్షకు దిగారు.
 
 
à°ˆ దీక్షను విరమింపజేసే సమయంలో... కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించడంపై రెండు నెలల్లోగా కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోతే రాష్ట్రమే పరిశ్రమను స్థాపించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని, కేంద్రంపైనా ఒత్తిడిని మరింత పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. దీనిపై అధ్యయనానికి టాస్క్‌ఫోర్సును నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీఎండీసీ à°Žà°‚à°¡à±€ వెంకయ్య చౌదరి కోరారు. దీంతో... గురువారం టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తూ మైనింగ్‌ శాఖ కార్యదర్శి శ్రీధర్‌ ఉత్తర్వు జారీ చేశారు.
 
తెలంగాణ, ఏపీలో ఒకేసారి స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటును పరిశీలిస్తామని ప్రకటించిన కేంద్రం ఇప్ప ట్లో à°•à°¡à°ª స్టీల్‌ప్లాంట్‌ సాధ్యం కాదని పరోక్షంగా తేల్చేసింది. ఇలాంటి తరుణంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేలా నియమించిన à°ˆ టాస్క్‌ఫోర్సు చైర్మన్‌à°—à°¾ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వ్యవహరిస్తారు. న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర గనులశాఖ కార్యదర్శి, పరిశ్రమల శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఆర్థికశాఖ కార్యదర్శి, ఏపీఎండీసీ à°Žà°‚à°¡à±€-వైస్‌ చైర్మన్‌... కన్వీనర్‌à°—à°¾ వ్యవహరిస్తారు.