ఒక పడకపై ఇద్దరు బాలింతలు....

Published: Sunday August 05, 2018
 à°…వే యూనిట్లు.. అదే సిబ్బంది.. గర్భిణులు, బాలింతలు మటుకే పెరుగుతున్నారు. పెరిగే à°ˆ సంఖ్యకు, ఆస్పత్రుల్లో వసతులకు మధ్య లెక్క కుదరదు. దీంతో దశాబ్దాలు గడిచిపోతున్నా ప్రభుత్వాసుపత్రుల్లో ‘కాన్పుల కష్టాలు’ మాత్రం తీరడం లేదు. à°’à°• బెడ్‌పై ఇద్దరు గర్భిణులు, ముగ్గురు చిన్నారులు కనిపించే దృశ్యంలో ఎలాంటి మార్పూ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పెద్దాసుపత్రిలోని గైనిక్‌ యూనిట్‌ను చూసినా ఇదే పరిస్థితి. ముఖ్యంగా డీఎంఈ ఆసుపత్రుల్లో గర్భిణులు, చిన్నారుల కష్టాలకు మేర లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 పెద్దాసుపత్రులు ఉన్నాయి. వీటిలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, కర్నూలు ఆస్పత్రులు రాష్ట్రంలోని సగం మందికిపైగా గర్భిణుల గైనిక్‌ సమస్యలను తీరుస్తున్నాయి. à°ˆ ఆసుపత్రుల్లో గైనిక్‌ ఓపీనే ప్రతి రోజు 300 నుంచి 500 మధ్య ఉంటుంది. డెలవరీల సంఖ్య 50 నుంచి 70 మధ్యలో ఉంది. à°ˆ లెక్కన ఎనిమిది నుంచి 10 గైనిక్‌ యూనిట్లు చొప్పున ఏర్పాటు కావాలి. కానీ రెండు నుంచి నాలుగు యూనిట్లతోనే à°ˆ ఆస్పత్రులు కాలం వెల్లదీస్తున్నాయి. దీంతో గర్భిణీలకు సరిపడినన్ని పడకలు అందుబాటు లేవు. తమ ఆసుపత్రుల్లో యూనిట్లు పెంచాలంటూ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు గైనిక్‌ ప్రొఫెషర్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ప్రతి ఏటా ప్రతిపాదనలు పంపిస్తున్నారు.
 
ఆ మాత్రమూ భారమే!
సాధారణంగా గైనిక్‌ యూనిట్లు పెంచాలని ప్రతి ఏటా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు డీఎంఈకి ప్రతిపాదనలు పంపిస్తారు. కానీ à°ˆ ఏడాది మొదటల్లో ఏ ఏ ఆసుపత్రిలో ఎన్ని à°¯à±‚నిట్లు అవసరం ఉందో ప్రతిపాదనలు పంపించాలని డీఎంఈ అధికారే స్వయంగా సూపరింటెండెంట్లను కోరారు. డీఎంఈ నుంచే ప్రతిపాదనలు కోరడంతో గర్భిణీల కష్టాలు తీరుతాయని సూపరింటెండెంట్లు భావించారు. డీఎంఈ నుంచి వచ్చిన సూచనల మేరకు తమ ఆసుపత్రిలో పెరగాల్సిన యూనిట్లు, సిబ్బంది కొరత వివరాలను డీఎంఈకి పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల నుంచి వచ్చిన ప్రతిపాదనలు స్వీకరించిన డీఎంఈ అధికారులు.. మొత్తం స్ర్కూట్నీ చేశారు. సూపరింటెండెంట్లు à°…à°¡à°¿à°—à°¿à°¨ విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే మొత్తానికే అగిపోతాయని డీఎంఈ అధికారులు భావించారు. దీంతో సూపరింటెండెంట్లు రెండు యూనిట్లు అడిగితే, డీఎంఈ అధికారులు స్ర్కూట్నీలో à°’à°•à°Ÿà°¿ తొలగించి, à°’à°•à°Ÿà°¿ ఉంచారు. కొన్ని ఆసుపత్రులను ఏకంగా ప్రతిపాదనల జాబితానుంచి తొలగించేశారు. పేర్లను కూడా తొలగించారు. కాకినాడ ఆసుపత్రికి 2, కేజీహెచ్‌à°•à°¿ 2, విజయవాడ పాత ఆసుపత్రికి 2, కర్నూలు ఆసుపత్రికి 2 గైనిక్‌ యూనిట్లు అవసరమని ప్రతిపాదించారు.