అన్నను కాదని నాడు మద్దతిచ్చా ఇప్పుడు రోజూ బాధపడుతున్నా..

Published: Wednesday October 03, 2018
‘మీరు నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చు పెట్టండి. రూ.50 కోట్లు ఖర్చు పెట్టండి. 2019లో తెలుగుదేశం అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత జనసేనదే’ అని à°† పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. మంగళవారం జంగారెడ్డిగూడెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. తనకు జీవితాన్నిచ్చిన అన్నను కాదని టీడీపీకి మద్దతిచ్చానని, ఎందుకిచ్చానా అని ఇప్పుడు రోజూ బాధ పడుతున్నానని తెలిపారు. తాను జగన్‌లా వెంటనే సీఎం కావాలని రాజకీయాల్లోకి రాలేదని, తనకు అనుభవం లేని కారణంగా అనుభవజ్ఞుడని.. పెద్దవాడని చంద్రబాబుకు మద్దతిచ్చామని చెప్పారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తామని తెలుగుదేశం భావిస్తే పొరబడినట్లేనన్నారు.
 
‘దేశంలో భారీ మార్పులు వస్తాయి. జనసేనకు ఆరు శాతం కాదు.. నూరు శాతం ప్రజా మద్దతు ఉంది. కేవలం 30, 40 సీట్లు వచ్చిన వారు ముఖ్యమంత్రి అవ్వగలరని ఎవరైనా ఊహించారా? 2019లో రాష్ట్రం పరిస్థితి కూడా ఇదే’ అని జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ నేతలు వందల ఎకరాల అటవీ భూములను మింగేశారని పవన్‌ ఆరోపించారు. పోలవరం నిర్వాసితులకు అన్యాయం చేశారని, కనీసం రోడ్లు వేయలేదని దుయ్యబట్టారు. సేంద్రియ వ్యవసాయం పేరుతో వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చి ప్రజల నెత్తినరుద్దారని, రూ.50 వేల కోట్లు ఉన్న రాష్ట్ర అప్పును రూ.లక్షా 50 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. ‘దెందులూరు ఎమ్మెల్యేకు జంగారెడ్డిగూడెంలో ఏం పని? సంపదలను చోరీ చేయడానికా? అడవులను కబ్జా చేయడానికా?’ అని మండిపడ్డారు.
 
దాదాపు 135 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ జనసేన మేనిఫెస్టోను కాపీ కొడుతోందని, ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ హామీని మేనిఫేస్టోలో పెట్టిందన్నారు. తనపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు అనే ఆయుధంతో à°ˆ దుర్మార్గపు పాలనను ఓడించాలని పిలుపిచ్చారు. తాను సోమవారం తెల్లవారుజామున లక్ష్మీపురంలోని నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తే.. రహస్య పూజలు చేస్తున్నానని ప్రచారం చేసేవారు.. పసిపాప విరాళమిస్తే 11 రూపాయలు తీసుకున్నానని స్టింగ్‌ ఆపరేషన్‌ చేస్తున్నారని, జిల్లాలో 450 ఎకరాల అటవీ భూములు కబ్జా చేస్తుంటే వారంతా ఏం చేస్తున్నారని మీడియాను ప్రశ్నించారు. కాగా.. పవన్‌ మంగళవారం ద్వారకాతిరుమలలోని చినవెంకన్న ఆలయాన్ని, జంగారెడ్డిగూడెం మద్దిలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు.