శాపనార్ధాలకు ఓట్లు రాలవు: సోమిరెడ్డి

Published: Friday October 05, 2018
 ‘పిల్లి శాపనార్ధాలకు ఉట్లు తెగవు.. కేసీఆర్‌ శాపనార్ధాలకు ఓట్లు రాలవు’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ‘కేసీఆర్‌ తిట్ల పురాణం చూస్తుంటే ఆయనలో ఓటమి భయం కనిపిస్తోంది. చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేక ఆంధ్రులను తిట్టి ఓట్లు తెచ్చుకోవాలనే ప్రయత్నానికి దిగజారారు’ అని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీనే లేదన్న కేసీఆర్‌ ఇప్పుడు టీడీపీని చూసి ఎందుకు వణుకుతున్నారని ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఆదాయం వల్లే తెలంగాణ ధనిక రాష్ట్రమైంది. ఇంత ఆదాయం ఇచ్చే స్థాయికి హైదరాబాద్‌ను తెచ్చింది చంద్రబాబు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధే నగరాన్ని à°ˆ స్థాయికి తెచ్చింది. à°ˆ మాట మేం అంటున్నది కాదు. హైదరాబాద్‌ను చంద్రబాబే అభివృద్ధి చేశారని స్వయంగా కేసీఆరే బహిరంగ సభల్లో చెప్పారు. అలాంటి కేసీఆర్‌.. తెలంగాణను బాబు నాశనం చేశారని ఇప్పుడు అనడం బాధాకరం’ అని వ్యాఖ్యానించారు.
 
 
పనిలో పోటీపడాలి తప్ప చంద్రబాబును చూసి ఈర్ష్య పడటం మానుకోవాలన్నారు. ‘టీడీపీ అంటే అంతులేని ద్వేషంతో కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. ఆయనను రాజకీయంగా పైకి తెచ్చింది తెలుగుదేశం పార్టీ. కేసీఆర్‌ మంత్రివర్గంలో సగం మంది టీడీపీ నుంచి వచ్చిన వారే. ఆయనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తెలంగాణలో టీడీపీ ఉండి తీరుతుంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో, 2009 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని కేసీఆర్‌ పోటీ చేశారు. ఇప్పుడు à°† పార్టీలను విమర్శిస్తే ప్రజలు నవ్వుకొంటారు’ అని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల కోసం రూ.500 కోట్లు బాబు పంపుతున్నారన్న ఆరోపణ అర్ధం లేనిదని కొట్టివేశారు. మోదీ నుంచి కేసీఆర్‌ వరకూ అందరూ బాబును చూసి భయపడుతున్నారని, à°† భయంతోనే కలిసిపోయి కలిసికట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.