అంకెల గారడీకి నేతలు సై

Published: Saturday October 20, 2018
జిల్లాలో ప్రస్తుతం సర్వేల కాలం నడుస్తోంది. అధికారంలో ఉన్న వారు మళ్లీ ఎలా గెలవాలనే దిశగా ప్రణాళకలు రూపొందిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో తాము చేసిన అభివృద్ధే తమకు ఆయుధమంటూ ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్ష వైసీపీ మాత్రం వారికి అనుకూలంగా ఉండే సామాజికవర్గ ఓట్లతోపాటు ప్రభుత్వ వ్యతిరేకతే తమను అధికారంలోకి తెస్తుందని బలంగా నమ్ముతోంది. ఇప్పటికే టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటింది. ఎన్నికల సమయం సమీపించిం ది. ఒకవైపు సీఎం చంద్రబాబు టీడీపీకి చెందిన గ్రామీణ ప్రాంత నాయకుల నుంచి జిల్లా నేతలవరకు పార్టీ కార్యక్రమాలతో అందరూ బిజీబిజీగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. అలాగే అప్పుడప్పుడూ పార్టీకి సమస్యాత్మకంగా ఉన్న జిల్లా నేతలందరినీ పిలిపించి సీల్డ్‌ కవర్లు ఇచ్చి హెచ్చరిస్తున్నా రు. ఇవన్నీ à°’à°• ఎత్తయితే రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని సిట్టింగుల్లో కొందరిని మార్చాలని టీడీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేతలు ఎవరికి వారుగా తాము నియోజకవర్గంలో ఎంతమాత్రం పట్టుకలిగి ఉన్నామో బాస్‌ముందు నిరూపించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకోసం పీపుల్స్‌ సర్వేలో మునిగిపోయారు. విశేష అనుభవం కలిగిన సంస్థలను గుట్టుగా సంప్రదించి రంగంలోకి దించుతున్నారు. మరికొందరు అదేపనిగా ఇంజనీరింగ్‌ విద్యార్థుల ద్వారా సర్వేలు చేయించి నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు.
 
 
à°ˆ నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ వేలకోట్లు ఖర్చు చేసి తాము అభివృద్ధి చేశామని అధికార పార్టీ బహిరంగంగా చెప్పుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం మంజూరైన నిధులు కూడా కలుపుకుని అభివృద్ధి ఖాతాలో జమచేసుకుంటున్నారు. ప్రజలకు తాముకాక మరెవరు దగ్గరగా ఉన్నారంటూ తమ ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తమను కాకపోతే మరెవరిని ఎన్నుకుంటారు? అనే అతివిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అధికార పార్టీ సిట్టింగుల్లో అధినేత వ్యాఖ్యలు గుబులు రేపుతున్నాయి. ‘మీ జాతకాలన్నీ నాదగ్గరున్నాయ్‌.. ప్రజలు దూరమైతే టిక్కెట్లు ఇవ్వను’ అని కరాకండిగా చంద్రబాబు చెబుతూవస్తున్నారు. జిల్లాలో కూడా ఈసారి కొందరు సిట్టింగులకు సీట్లు రావనే చర్చ జరుగుతోంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది పైకి గంభీరంగానే కనిపిస్తున్నా లోలోన వారిని సీటు భయం వెంటాడుతూనే ఉంది. మళ్లీ తమకే టిక్కెట్టు ఖాయమంటూ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నాయకులు, కార్యకర్తలు, ప్రజల్లో నమ్మకం కలిగించడానికి నానా తంటాలు పడుతున్నారు.