ఇంత నాశనమైతే విపక్ష నేత జగన్‌ ఎక్కడ?

Published: Saturday October 20, 2018
 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా తుఫాను బాధితులను కేంద్రం ఆదుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌పై రాజకీయ కక్షతోనే వారిని ఇబ్బంది పెడుతోందన్నారు. రాష్ట్ర ప్రజలెవరూ బీజేపీకి ఓట్లు వేయరనే కారణంతోనే ఏ సాయమూ చేయడం లేదని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో గురువారం చంద్రబాబు దసరా పూజలు నిర్వహించారు. తుఫాను బాధితులతో కలిసి పండుగ జరుపుకొన్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జులు, ప్రధాన కార్యదర్శులు, నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇటీవల ‘మీ టూ’ ఉద్యమం వల్ల à°“ కేంద్రమంత్రి పదవి పోయిందని.. ప్రత్యేక హోదా సాధన విషయంలోనూ అటువంటి ఉద్యమం జరగాలని ఆకాంక్షించారు. ఆయా సందర్భాల్లో ఏమన్నారో ఆయన మాటల్లోనే..
 
పరామర్శించే బాధ్యత లేదా?
‘తితలీ తుఫానును కేంద్రప్రభుత్వం నోటిఫై చేసింది. అలాంటప్పుడు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన ప్రాంతాన్ని పరామర్శించి ఆదుకోవలసిన బాధ్యత లేదా? కేవలం రాజకీయ కక్షతో మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. బాధితులను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆదుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తమకు ఓట్లు పడవని బీజేపీ సాయం చేయడం లేదు. రేపు ఓట్లు కోసం ఇక్కడికి ఎలా వస్తారో చూస్తాం. నష్టాన్ని చూసేందుకు కూడా కేంద్రంలోని బీజేపీ నేతలు రాలేదు. బాధితులపై ఒక్క సానుభూతి మాట మాట్లాడలేదు. తక్షణ సాయంగా డబ్బులు ఇవ్వలేదు. మనం తితలీ తుఫాను సహాయక చర్యల్లో రేయింబవళ్లు పనిచేస్తుంటే కేంద్రం లగ్నం పెట్టి మరీ టీడీపీ ఎంపీల ఇళ్లపై ఐటీ దాడులు చేయిస్తోంది.
 
దాడులు చేసే సమయమిదా? గుంటూరులో బీజేపీ రాష్ట్ర కార్యాలయం శంకుస్థాపనకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వచ్చారు. దీనికిచ్చిన ప్రాధాన్యం తుఫాను బాధితులకు ఇవ్వలేరా? పార్టీ కార్యాలయం శంకుస్థాపనకు ఇదా సమయం? మీరు కుట్రతో పనిచేస్తున్నారు. మేం ధర్మం కోసం పోరాడుతున్నాం. నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. టీడీపీతో ఉంటూనే వైసీపీతో పొత్తు పెట్టుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కేసులను నీరుగార్చారు. ఇప్పుడు పనిగట్టుకుని నాపై పవన్‌ కల్యాణ్‌ను, టీఆర్‌ఎ్‌సను ఉసిగొల్పుతున్నారు. నేనేం తప్పుచేశానని మోదీ, జగన్‌, కేసీఆర్‌, పవన్‌ ఏకమై నన్ను వేధిస్తున్నారు?’