సెంట్రల్‌ జైలులో జిరాక్స్‌ కరెన్సీ నోట్ల లభ్యం

Published: Sunday October 21, 2018
రాజమహేంద్రవరం: à°¸à±à°¥à°¾à°¨à°¿à°• కేంద్ర కారాగారంలో దొంగ నోట్లు దొరకడం కలకలం రేపింది. జైలులో రూ.68,700 విలువైన 91 దొంగ నోట్లు లభ్యం కావడం పలు అనుమాలకు తావిస్తోంది. à°ˆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జైలులోని ఫర్నీచర్‌, బీరువాలు, కుట్టు, వస్త్రాలు, డోర్‌ మ్యాట్‌లు వంటి తయారీ పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో ఖైదీలు పని చేస్తారు. కుట్టు పరిశ్రమలో సాంఘిక సంక్షేమ శాఖ, జైళ్ళ శాఖతో పాటుగా వివిధ శాఖలకు యూనిఫారాలు, చొక్కాలు, ప్యాంట్లు వంటివి కుడతారు. తయారీ క్రమంలో కటింగ్‌ చేసేప్పుడు వచ్చే రద్దును పరిశ్రమలోనే మెట్ల à°•à°¿à°‚à°¦ పడేస్తారు. దానిని గమనించిన సూపరింటెండెంట్‌ పీజీ సాయిరాం ప్రకాష్‌ à°† రద్దును తొలగించి అక్కడ మరో మిషన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. à°ˆ నెల 12à°µ తేదీన సిబ్బంది వాటిని తొలగిస్తుండగా à°’à°• కరెన్సీ నోట్ల కట్ట బయట పడింది.
 
దానిని వార్డర్‌ త్రిమూర్తులు గుర్తించి పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. అవన్నీ జిరాక్స్‌ తీసిన కరెన్సీ నోట్లలా ఉన్నాయి. వాటిలో రూ.2వేల నోట్లు 20, రూ.500 నోట్లు 53, రూ.200 నోట్లు 4, రూ.100 నోట్లు 14 ఉన్నాయి. వాటిలో 6డీఎం633631 సిరీస్‌ రూ.200నోట్లు, 7డీఏ564594 సిరీస్‌ రూ.500నోట్లతో పాటుగా పలు సిరీస్‌à°² నోట్లు ఉన్నాయి. ఒకే సిరీస్‌కు చెందినవి à°’à°•à°Ÿà°¿à°•à°¿ పైగా జిరాక్స్‌ నోట్లు ఉన్నాయి. దీనిపై సూపరింటెండెంట్‌ సాయిరాం ప్రకాష్‌ను వివరణ కోరగా జిరాక్స్‌ నోట్లు ఎలా వచ్చాయో తెలియదని చెప్పారు. ఖైదీల వద్ద సిగరెట్‌, బీడీల వంటివి దొరికితే à°’à°• బాక్స్‌లో వేస్తామని, దానిలో à°† నోట్లను పడేశామన్నారు. వాటిని కాల్చేస్తామని చెప్పారు. కరెన్సీ నోట్లు జిరాక్స్‌ ఎక్కడ తీశారు? అవి లోపలికి ఎలా వచ్చాయి? ఎలా బయటకు వెళుతున్నాయి? ఎక్కడ వాటిని చలామణి చేస్తున్నారు? ఎన్నాళ్ళుగా à°ˆ తతంగం జరుగుతోంది? దీనిలో జైలు సిబ్బంది పాత్ర à°Žà°‚à°¤? అధికారుల సహకారం à°Žà°‚à°¤? అనేది ఉన్నతాధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.