పంట రుణాల పంపిణీ వేగవంతం చేయాలి

Published: Monday November 12, 2018
రెండేళ్లుగా వర్షపాతంలోటు ఉన్నా రైతులకు ఇబ్బంది లేకుండా చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. à°ˆ ఏడాది 34 శాతం వర్షపాతం లోటు ఉందని..అయినా రాబడిని పెంచుకోవాలని సూచించారు. ఖరీఫ్‌లో తగ్గిన సేద్య విస్తీర్ణం రబీలో భర్తీ చేయాలన్నారు. రాయితీ విత్తనాల సరఫరా..పంట రుణాల పంపిణీ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జొన్న, మొక్కజొన్నపై కత్తెర పురుగు నివారించాలని, ఇతర ప్రాంతాల నుంచి ఏ తెగుళ్లు కూడా రాష్ట్రానికి విస్తరించరాదన్నారు. సూక్ష్మ సేద్యం విస్తీర్ణం కోటి ఎకరాలకు పెరగాలని సీఎం పేర్కొన్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఇతర దేశాలకు à°’à°• నమూనాగా అని తెలిపారు. ఏపీలో వ్యవసాయ విధానాలపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఉందని సీఎం అన్నారు.
 
క్రిస్మస్ పండగ లోపు ఎస్సీ కాలనీల్లో సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో ఇంకుడు కుంటల తవ్వకం ముమ్మరం చేయాలన్నారు. పంటకుంటల తవ్వకం సీమ జిల్లాలకు ఎంతో ఊరట అయ్యిందని చెప్పుకొచ్చారు. స్వైన్ ఫ్లూ, డెంగీ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జనవరి 1 కల్లా అన్ని పంచాయతీలు స్వచ్ఛ గ్రామాలుగా రూపొందాలని తెలిపారు. ఓడిఎఫ్ తరహాలోనే ఓడీఎఫ్ ప్లస్ విజయవంతం చేయాలని సీఎం అన్నారు. గ్రామాలన్నీ స్వచ్ఛంగా మారితే అంటువ్యాధుల బెడద ఉండదన్నారు. 48రోజుల్లో అన్ని గ్రామాల్లో మౌలికవసతుల పనులు పూర్తి కావాలని, వచ్చే ఏడాది నరేగా నిధులకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.