రాష్ట్ర పరిపాలనను పక్కన పెట్టి జాతీయ రాజకీయాల....

Published: Wednesday November 21, 2018
 à°®à±à°–్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పరిపాలనను పక్కన పెట్టి జాతీయ రాజకీయాల గురించి తిరుగుతున్నారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. పాలనను గాలికి వదిలేసి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో మంతనాలు చేస్తారని, తమిళనాడు వెళ్లి డీఎంకే నేత స్టాలిన్‌తో సాంబారు ఇడ్లీ తిని వస్తారని.. బెంగాల్‌ వెళ్లి సీఎం మమతా బెనర్జీతో మంత్రాంగం చేస్తారని.. ఇదేం రాజకీయమని ప్రశ్నించారు. పాదయాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం కురుపాంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘నాలుగేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబు ఇప్పుడు దొంగ రాజకీయాలు చేస్తున్నారు.
 
కేంద్రంతో కలిసిఉన్నపుడు ప్రత్యేక హోదా అంశం కనిపించలేదా? కేంద్రంతో సఖ్యతగా ఉన్న రోజుల్లోనైనా చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమైనా చేశారా? జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తానంటూ ప్రధాని పదవిని పంచుకుందామని ప్రాంతీయ పార్టీల నాయకులతో ముచ్చటిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ఆపరేషన్‌ గరుడ పేరుతో తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని యాగీ చేస్తూ ప్రతి రోజూ టీవీల్లో ఊదరగొడుతున్న చంద్రబాబు.. ఢిల్లీ వెళ్లినప్పుడు ఒక్కసారైనా రాష్ట్రపతిని కలిసి విచారణ చేయించాలని ఎందుకు కోరలేదని నిలదీశారు. సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్‌ వేయలేదని ప్రశ్నించారు. విచారణ కోరితే ఆయనే దొంగని తేలుతుందన్న భయమే కారణమన్నారు. తితలీ తుఫాను నష్టం రూ.3,435 కోట్లు అన్న సీఎం.. ఇంతవరకు రూ.520 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు.
 
పది శాతం పూర్తిచేసి గొప్పలా?
విజయనగరం జిల్లాలో గుమ్మిడిగెడ్డ ప్రాజెక్టు ఊసే లేదని, జంఝావతి సమస్యను ఒడిశా ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించే దశగా ప్రయత్నం చేయలేదని జగన్‌ అన్నారు. వైఎస్‌ హయాంలో రబ్బరు డ్యాం ఏర్పాటు చేసి ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించారని చెప్పా రు. తోటపల్లి ప్రాజెక్టు పనులు 90శాతం వైఎస్‌ హయాంలో జరిగాయని, మిగిలిన 10ు పూర్తి చేసిన టీడీపీ ప్రభుత్వం కొబ్బరికాయ కొట్టి మొత్తం ఘనతంతా తనదేనని చాటుకుంటోందని తెలిపారు. టీడీపీ నాయకులు కురుపాం ఎమ్మెల్యేకు ఎన్నో ప్రలోభాలు పెట్టారని, అయినప్పటికీ వైసీపీని నమ్ముకుని ఉన్న పుష్పశ్రీవాణిని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో 26 మండలాల్లో కరువు ఉందని ప్రభుత్వానికి నివేదిస్తే నాలుగు మండలాలను మాత్రమే ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు.
 
నాలుగున్నరేళ్లుగా గొప్పలు చెబుతూ వస్తున్న పోలవరం ప్రాజెక్టు పునాదులు కూడా దాటలేదన్నారు. రాష్ట్రంలో 108 వాహనాలు పడకేశాయని తెలిపారు. మార్చి నెలలో ఎన్నికలు వస్తాయని, ఎవరి పట్ల విశ్వనీయత ప్రజలకు ఉందో తేలుతుందని చెప్పారు. రాష్ట్రంలో దేవుడి దయవల్ల మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తే ముందు పరిపాలనా విధానంలో మార్పులు చేస్తానన్నారు. నవరత్నాలుగా ప్రకటించిన à°… ద్భుత పథకాలను అందరికీ అమలు చేస్తామని చెప్పారు. మహిళా సంఘాల రుణాల మొత్తా న్ని నాలుగు విడతల్లో మాఫీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, అరకు పార్లమెంట్‌ కన్వీనర్‌ పరీక్షిత్‌రాజు, బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు.