బాబుతో ప్రయాణం ప్రమాదం... రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నారు

Published: Thursday November 22, 2018
వచ్చే ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని, తాను ముఖ్యమంత్రి కావడం తథ్యమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. దక్షిణ భారత హక్కుల కోసం జరిగే పోరాటానికి తాను నేతృత్వం వహిస్తానని కూడా తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో తన పార్టీని పరిచయం చేసేందుకు తొలిగా బుధవారం చెన్నై వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ఇటీవల డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ కావడంపై బదులిస్తూ.. ‘చంద్రబాబుతో ప్రయాణం చాలా ప్రమాదకరం. ఆయన ఎప్పుడు ఎవర్ని ఎత్తుతారో, ఎవర్ని దించేస్తారో చెప్పలేం. ఎవరితో స్నేహం చేస్తారో, ఎవరితో శత్రుత్వం నెరపుతారో అర్థంకాదు. అందువల్ల ఆయన్ను విశ్వసించలేం. చంద్రబాబు చెప్పే కూటమిలో ఎవరు చేరినా వారిని దారుణంగా మోసం చేయగలరు. చంద్రబాబు రాజకీయ రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నారు. తన కుమారుడు లోకేశ్‌ను ప్రమోట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కనీసం పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని లోకేశ్‌.. పంచాయతీరాజ్‌ మంత్రిగా వ్యవహరిస్తున్నారు’ అని అన్నారు. వైసీపీతో పొత్తుకు జనసేన ప్రయత్నించిందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. అవన్నీ అవాస్తవాలన్నారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. ఏపీలో త్రిముఖ పోరు తప్పదన్నారు. ‘ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి నేనే పోరాడుతున్నా. జగన్‌ దీనిపై నోరెత్తితే కేంద్రం కేసుల చిట్టా చూపిస్తుంది. దాంతో ఆయన మిన్నకుండిపోతున్నారు’ అని ఎద్దేవా చేశారు.
 
తగినంత సమయం లేకనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని పవన్‌ వివరణ ఇచ్చారు. తాము à°† రాష్ట్రంలో ఎవరికీ మద్దతివ్వడం లేదని.. తన వద్దకు వచ్చి à°…à°¡à°¿à°—à°¿à°¨ అభిమానులకు మాత్రం ఎవరికి ఓటేయాలో చెబుతున్నానని తెలిపారు. చంద్రబాబు ప్రయత్నిస్తున్న కూటమిలో చేరే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. వచ్చే ఎన్నికలు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి ఉంటాయని, సంకీర్ణ ప్రభుత్వానికే ఎక్కువగా అవకాశముందన్నారు. ఏపీ భవిష్యత్‌ జనసేనతో ముడిపడి ఉందని చెప్పారు. ఏపీని బీజేపీ, కాంగ్రెస్‌ అన్యాయంగా విభజించాయని, తద్వారా ఏపీ ప్రజలు పూర్తిగా నష్టపోయారని పవన్‌ చెప్పారు. ‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో à°—à°¤ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చాను. బీజేపీ పూర్తిగా నిరాశపరిచింది. రాష్ట్రానికి à°† పార్టీ చేసిన నష్టాన్ని చూశాక దానితో కలిసేందుకు ఎవరూ ముందుకు రారు. నేనూ బీజేపీతో పొత్తు పెట్టుకోను. నేనా పార్టీకి స్నేహితుడిని కాను’ అని తెలిపారు.