కరెంటు చార్జీల పెంపు లేదు

Published: Sunday November 25, 2018
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ చార్జీలు పెంచరాదని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) నిర్ణయించాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్లకు సరఫరా చేసే విద్యుత్‌ ధరను యూనిట్‌కు రూ.6.95 నుంచి రూ.5.95à°•à°¿ తగ్గించాలని ప్రతిపాదించాయి. అలాగే రైల్వే ట్రాక్షన్‌కు ఇచ్చే కరెంట్‌ను యూనిట్‌పై రూ.1 పెంచాలని కోరాయి. à°ˆ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌ సీ)à°•à°¿ 2019-20 సంవత్సరానికి గాను వార్షిక రాబడి నివేదిక(ఏఆర్‌ఆర్‌)ను సమర్పించాయి. ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ గ్రంధి భవానీప్రసాద్‌ను ట్రాన్స్‌కో జేఎండీ దినేశ్‌ పరుచూరి, ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌వై దొర శనివారమిక్కడ కలిసి నివేదికను అందించారు. దీని ప్రకారం.. రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-20)లో సగటు విద్యుత్‌ సరఫరా ఖర్చు యూనిట్‌కు రూ.6.34à°—à°¾ ఉంటుంది.
 
టారిఫ్‌ ద్వారా యూనిట్‌కు రూ.4.86 వస్తుంది.. లోటు రూ.1.49à°—à°¾ ఉండే అవకాశం ఉంది. వార్షిక అవసరాలకు రూ.38,204 కోట్లు అవసరం. టారిఫ్‌, నాన్‌-టారిఫ్‌ ఆదాయం à°•à°¿à°‚à°¦ రూ.29,241 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. రెవెన్యూ లోటు రూ.8,963 కోట్లుగా ఉంటుంది. అలాగే రాష్ట్రంలో 68,584 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందుబాటులో ఉంది. రాష్ట్ర అవసరాలకు 67,713 మిలియన్‌ యూనిట్లు సరిపోతాయి. అంటే 870 మిలియన్‌ యూనిట్ల మిగులు విద్యుత్‌ ఉందన్న మాట. చార్జీలు పెంచకపోవడం వల్ల 1.64 కోట్ల మంది వినియోగదారులకు యూనిట్‌కు రూ.1.49 దాకా ఆదా అవుతుంది. 1.32కోట్ల మంది ఎల్‌à°Ÿà±€(1) గృహ వినియోగదారులపై ఎలాంటి భారం వేయడం లేదు. 17లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు 7 à°—à°‚à°Ÿà°² పాటు ఉచిత విద్యుత్‌ అందుతోంది. దోబీ ఘాట్లకు, గ్రామీణ నర్సరీలకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు.
 
2 నెలల్లో సోలార్‌ ప్రాజెక్టు సిద్ధం
రెండు నెలల్లో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జెన్‌కో సోలార్‌ థర్మల్‌ ప్రాజెక్టు అందుబాటులోకి రానుందని దినేశ్‌ పరుచూరి తెలిపారు. పవన, సౌర విద్యుత్‌ ద్వారా 16 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుందని, దేశంలో ఇది అత్యధికమని చెప్పారు. పునరుత్పాదక ఇంధన వనరులపై à°—à°¤ నాలుగేళ్ల కాలంలో రూ.50వేల కోట్లు వెచ్చిం చామని, దీనివల్ల à°ˆ విద్యుత్‌ అత్యధికంగా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. బొగ్గు ఆధారిత విద్యుత్‌పై ఆధార పడటం తగ్గిందన్నారు. రాయలసీమ జిల్లాల్లో రూ.50వేల కోట్లతో సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పాదనకు పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో సగటు విద్యుత్‌ వినియోగం 1300యూనిట్లుగా ఉందని చెప్పారు. ఫిబ్రవరిలో టారిఫ్‌ ఆర్డర్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. తితలీ తుఫానుతో ట్రాన్స్‌కోకు రూ.156 కోట్లు, డిస్కమ్‌లకు రూ.349 కోట్ల నష్టం జరిగిందని 2,300 గ్రామాల్లో విద్యుత్‌ వ్యవస్థ అతలా కుతలమైందని, అక్టోబరు 25నాటికి సంపూర్ణంగా పునరు ద్ధరించామని హెచ్‌వై దొర అన్నారు.