జస్టిస్‌ పున్నయ్యకు తలకొరివి పెట్టిన ప్రతిభాభారతి

Published: Monday December 03, 2018
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కొత్తపల్లి పున్నయ్య (95) అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పున్నయ్య.. శనివారం విశాఖలోని పినాకిల్‌ ఆస్పత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుం à°¬ సభ్యులు ఆయన మృతదేహాన్ని పున్నయ్య అత్తవారిల్లు.. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామానికి తీసుకువచ్చారు. కుటుంబసభ్యులు, అభిమానులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో.. అశ్రునయనాల మధ్య ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. పున్నయ్య కుమార్తె, మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి తండ్రికి తలకొరివి పెట్టారు. పోలీసులు గౌరవ సూచకంగా మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి అచ్చెన్నాయుడు దగ్గరుండి à°ˆ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అచ్చెన్నతో పాటు జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు త్రిపురనేని వెంకటరత్నం, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ, జిల్లా జడ్జి శ్యామలాంబ తదితర ప్రముఖులు ఆదివారం పున్నయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.