విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌: ఎంపీ రామ్మోహన్‌

Published: Sunday December 31, 2017

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుచేయాలని టీడీపీ పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం శ్రీకాకుళంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రైల్వే జోన్‌పై ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టడం నా అదృష్టం అన్నారు. అలాగే జిల్లాలో కిడ్నీ సమస్యలతో పాటు సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై పార్లమెంట్‌లో ప్రస్తావించానని ఎంపీ అన్నారు. వంశధార ప్రాజెక్ట్ 2018లో పూర్తి కాబోతోందని, వంశధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో ఎంపీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎంపీ అన్నారు సిక్కోలు రైతు ఏడాదికి రెండు పంటలు వేసుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.