కొండను తవ్వి ఎలుకను పట్టారు
Published: Sunday August 04, 2019

నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చెబుతూ వస్తున్న ‘స్కిల్ ఇండియా’పై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కొండను తవ్వి ఎలుకను పట్టారంటూ ఆమె ఎద్దేవా చేశారు. పెద్ద ఎత్తున డోలు వాయిస్తూ పదే పదే చెప్పుకొచ్చిన స్కిల్ ఇండియాపై అసలు నిజాలు మాట్లాడే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ట్విట్టర్ ద్వారా ‘స్కిల్ ఇండియా’ రియాలిటీ ఇదంటూ ప్రియాంక ట్వీట్ చేశారు.
‘‘కొండను తవ్వి ఎలుకను పట్టారు.. అదే పనిగా డోలు వాయిస్తూ ‘స్కిల్ ఇండియా’ను తెగ ప్రచారం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వాస్తవ పరిశీలన చూద్దాం. అక్కడ మొత్తం 10 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. కానీ, కేవలం రెండు లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. ప్రభుత్వం దీనిపై నోరు తెరుస్తుందా?’’ అని ప్రియాంక ట్వీట్ చేశారు.

Share this on your social network: