హైదరాబాద్ హోటల్ వద్ద కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బస

Published: Friday May 18, 2018

హైదరాబాద్: కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హోటల్స్‌లోకి ఇతరులు ఎవరినీ అనుమతించడం లేదు. ముఖ్యమైన వారిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతినిస్తున్నారు. ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు బీజేపీ వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ తమ సభ్యులను ఎలాగైన కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.