వైసీపీకి జనసేన గండి

తెలుగుదేశం ఓటు బలం అప్పుడూ ఇప్పుడు దాదాపు సమానంగానే ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 44.9 శాతం ఓట్లను సాధించగా... ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 44.52ు ఓట్లు వస్తాయని తేలింది. వైసీపీ ఓట్లకు మాత్రం భారీగా గండిపడుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 44.6 శాతం ఓట్లను సాధించిన వైసీపీ.. ఇప్పుడు 37.23 శాతానికే పరిమితం అవుతోంది. ఆ పార్టీకి ఏకంగా 7.37 శాతం ఓట్లు తగ్గనున్నాయని సర్వే స్పష్టం చేసింది. ‘ఎన్నికల బరిలోకి దిగుతాం’ అని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ స్పష్టంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి 8.45 శాతం ఓట్లు సాధించే అవకాశముందని సర్వేలో వెల్లడైంది. వెరసి... వైసీపీ ఓట్లకు జనసేన గండికొడుతోందని అర్థమవుతోంది. అలాగే... 2014 ఎన్నికలతో పోల్చితే బీజేపీ, కాంగ్రెస్ ఓటు బలం కూడా తగ్గినట్లు సర్వే చెబుతోంది. ఆ పార్టీ ఓట్లను కూడా పవన్ పార్టీయే లాగేసుకుంటుందని స్పష్టమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని ఈ లెక్కలు చెబుతున్నాయి. కాగా, ఎవరికి ఓటు వేయాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని 5.40 శాతం మంది చెబుతుండటం ఇక్కడ కీలకమైన అంశం!

Share this on your social network: