విజయవాడలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం ...

Published: Monday July 23, 2018

 విజయవాడ:విజయవాడలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మిస్తామని, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా త్వరలో భూమి పూజ చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ 8.9 ఎకరాలలో రూ.60 కోట్లతో స్టేడియం నిర్మాణం ఉంటుందన్నారు. స్పోర్ట్స్‌ సిటీలుగా విశాఖ, అమరావతి, తిరుపతిని అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గాండీవా ప్రాజెక్ట్‌ దేశంలోనే మొదటిదని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీయడమే ప్రాజెక్ట్‌ ముఖ్యోద్దేశమని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్‌ సాధించడమే లక్ష్యమన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.